BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 23 August 2026, 06:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో వృద్ధుల ముసుగులో గంజాయి రవాణా.. ఐదుగురు అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:05 AM
46 వీక్షణలు

హైదరాబాద్‌లో వృద్ధుల ముసుగులో గంజాయి రవాణా.. ఐదుగురు అరెస్ట్

38 కిలోల డ్రై గంజాయి స్వాధీనం.. విలువ రూ.10 లక్షలు

హైదరాబాద్, ఆగస్టు 22: వయసు పైబడిన ప్రయాణికులపై అనుమానం తక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆసరాగా చేసుకుని గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వృద్ధుల ముసుగులో గంజాయి పార్సిళ్లను తరలిస్తున్న ఐదుగురిని సీసీఎస్‌ ప్రత్యేక క్రైమ్ టీమ్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 38 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 21న సీసీఎస్ క్రైమ్ టీమ్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో రాజారాం స్వామి కన్ను పడయాచి (78), సంతోష్ బాలారం ప్రజాపతి (65), విజయలక్ష్మి కలియమూర్తి పిల్లై (66), సిల్మినా కుజూర్ (36), షీలా దేవి (48) ఉన్నారు. వీరిలో కొందరు కూలీలుగా, మరికొందరు గృహ సహాయకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరకు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి రవాణా

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి బ్రౌన్ కలర్ పార్సిల్ కవర్లలో ప్యాక్ చేసేవారని గుర్తించారు. అనంతరం బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలించి, ఇక్కడ నుంచి మరో బస్సులో ముంబైకి తీసుకెళ్లి ముందుగా నిర్ణయించిన వ్యక్తులకు అప్పగించేవారని పోలీసులు తెలిపారు.

వయసును అడ్డుపెట్టుకుని అక్రమ రవాణా

వృద్ధ ప్రయాణికులపై సాధారణంగా తనిఖీలు తక్కువగా ఉంటాయనే అంశాన్ని ముఠా సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సామాన్ల మధ్య గంజాయి పార్సిళ్లను ఉంచుకుని ప్రయాణించేవారని తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కొంతసేపు లాడ్జిలో ఉండి, మరో బస్సు ద్వారా ముంబైకి వెళ్లేవారని వెల్లడించారు.

ప్రతి డెలివరీకి నిందితులకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు కమీషన్ అందించేవారని ప్రాథమిక విచారణలో తేలింది.

గత నేర చరిత్రపై దర్యాప్తు

అరెస్టైన కొందరికి గతంలోనూ గంజాయి రవాణాకు సంబంధించిన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరు? అరకు నుంచి గంజాయి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్ ఎంత విస్తరించింది? ముంబైలో పార్సిళ్లు స్వీకరిస్తున్న వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఆపరేషన్‌ను సీసీఎస్ క్రైమ్ టీమ్ ఇన్‌స్పెక్టర్ చి. సుధాకర్ రావు, ఎస్‌ఐ ఎన్. గౌరేందర్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి గాంధీనగర్ పోలీసుల సహకారంతో నిర్వహించారు. డీసీపీ, సీసీఎస్ ఎస్. చైతన్య కుమార్ పర్యవేక్షణలో చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మాదకద్రవ్యాల రవాణాపై పోలీసుల హెచ్చరిక

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాల్లో ఎవరూ భాగస్వాములు కావొద్దని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. డబ్బు కోసం క్యారియర్‌లుగా వ్యవహరించినా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.