BREAKING
బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు
Date of Publish : 05 September 2026, 10:22 am
Posted by : SEETHA KIRAN KUMAR

హనుమకొండలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 10:22 AM
6 వీక్షణలు

కాళోజీ కళాక్షేత్రంలో వైభవంగా వేడుకలు.. నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే

హనుమకొండ | Ntoday News

హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించేలా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణుడి జీవిత విశేషాలతో పాటు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని రూపొందించిన కూడా మాజీ చైర్మన్, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ను ఎమ్మెల్యే అభినందించారు.

సుందర్ రాజ్ యాదవ్ చిన్ననాటి నుంచే సేవా భావంతో ప్రజలకు సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ సమాజ సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు.

శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించాలని కోరుతూ సుందర్ రాజ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.