గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
నోషనల్ ఇంక్రిమెంట్లు, AAS అమలు సహా పలు డిమాండ్ల పరిష్కారానికి ఉద్యోగుల ఆందోళన
అనకాపల్లి | Ntoday News
గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు దిగారు. అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉద్యోగులు ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:
2 నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే అమలు చేయాలి.
AASను తక్షణమే అమలు చేయాలి.
GO.MS.No.11ను వెంటనే రద్దు చేయాలి.
ప్రతి ఉద్యోగికి కనీసం రూ.30,000 మూలవేతనం తగ్గకుండా ప్రమోషన్లు కల్పించాలి.
కిందిస్థాయి ఉద్యోగుల పని విధానాన్ని తీసుకువచ్చి అమలు చేయాలి.
డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేయాలి.
ఇన్‌చార్జ్ డ్యూటీలకు FAC అమలు చేయాలి.
ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్ మెసేజ్‌లు, టెలిఫోన్ కాల్స్ నిలిపివేయాలి.
సెలవు దినాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు CCL అమలు చేయాలి.
విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రావాల్సిన ప్రయోజనాలను 3 నెలల్లోపు అందించాలి.
మృత ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గ్రామ సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.