జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మర్యాదపూర్వక భేటీ.. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ
అమరావతి | Ntoday News
మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన పలు అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
జగన్‌మోహన్ రెడ్డితో గోవర్ధన్ రెడ్డి భేటీ కావడం వైఎస్సార్‌సీపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.