BREAKING
బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు
Date of Publish : 05 September 2026, 10:20 am
Posted by : SEETHA KIRAN KUMAR

మహిళనంటూ పరిచయం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.14.75 లక్షల టోకరా

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 10:20 AM
6 వీక్షణలు

లావణ్య పేరుతో నమ్మించి విద్య, వైద్యం, పెట్టుబడుల పేరుతో నగదు బదిలీ

వరంగల్ | Ntoday News

మహిళనంటూ పరిచయం చేసుకుని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నమ్మించి రూ.14.75 లక్షలు మోసం చేసిన కేసులో తమిళనాడుకు చెందిన వ్యక్తిని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన మణికందన్ సెల్లముత్తు ‘లావణ్య’ పేరుతో మహిళనంటూ పరిచయమయ్యాడు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బాధితుడి నమ్మకాన్ని పొందిన నిందితుడు.. అనంతరం విద్య, వైద్యం, పరిశోధన, పెట్టుబడుల పేరుతో దశలవారీగా నగదు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మొత్తం రూ.14.75 లక్షలు బదిలీ చేయించుకున్న అనంతరం మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడి ఆచూకీని గుర్తించి తమిళనాడులో అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితుడిని వరంగల్‌కు తరలించి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నగదు బదిలీ చేయవద్దని పోలీసులు సూచించారు.