BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పశ్చిమగోదావరి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా ఇందుకూరి రామకృష్ణంరాజు పేరు ఖరారు?

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:32 PM
20 వీక్షణలు

పశ్చిమగోదావరి జిల్లా తొలి జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం ఇందుకూరి రామకృష్ణంరాజును వరించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం వెలువడుతోంది. దీంతో జిల్లా రాజకీయాల్లో జడ్పీ ఛైర్మన్ ఎంపిక అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీ సీనియర్ నాయకుడిగా ఇందుకూరి రామకృష్ణంరాజు అందించిన సేవలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో తొలి జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇదే పదవిని ఆశించిన పీవీఎల్ నరసింహరాజుకు ఈ పరిణామం నిరాశ కలిగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇందుకూరి రామకృష్ణంరాజు పేరుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధిష్ఠానం తుది నిర్ణయం, అధికారిక ప్రకటనపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.