BREAKING
thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
Date of Publish : 23 September 2026, 09:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీకి భారీ వర్ష సూచన.. తీర ప్రాంతాల్లో అప్రమత్తత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 09:50 AM
17 వీక్షణలు

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రికి విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

వర్షాల నేపథ్యంలో నూజివీడు డివిజన్‌లో పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో సబ్‌ కలెక్టర్ ఆదేశాల మేరకు నూజివీడు డివిజన్ పరిధిలోని యాజమాన్య పాఠశాలలన్నింటికీ బుధవారం పరిహార సెలవు ప్రకటించారు. ఈ మేరకు నూజివీడు డివిజన్ డిప్యూటీ విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.