BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్వాన్ తుపానుతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:31 PM
23 వీక్షణలు

రేపు గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం తీర ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక ఏలూరు/ఆంధ్రప్రదేశ్, నవంబర్ 19: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. తుపాను గత ఆరు గంటలుగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను నరసాపురానికి 390 కిలోమీటర్లు, కళింగపట్నానికి 350 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 430 కిలోమీటర్లు, పూరీకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నానికి నరసాపురం నుంచి పూరీ మధ్యలో గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని హెచ్చరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.