BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 28 September 2026, 10:57 am
Posted by : SEETHA KIRAN KUMAR

భారీ వర్షాలతో బ్యాంకాక్‌లో జలమయం

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Sep, 2026 - 10:57 AM
59 వీక్షణలు

పలు ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలు నీటమునక.. వరద నీటి తొలగింపునకు అధికారుల చర్యలు

బ్యాంకాక్, సెప్టెంబర్ 28:

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి.

భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించేలా మారాయి.

వరద నీటిని తొలగించేందుకు నగరంలోని పంపింగ్ స్టేషన్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను వినియోగిస్తూ వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

కాలువలు, జలమార్గాలతో కూడిన భౌగోళిక స్వరూపం కారణంగా బ్యాంకాక్‌ను తరచూ ‘ఈస్ట్ వెనిస్’గా అభివర్ణిస్తుంటారు. తాజా భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునగడంతో ఆ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది.