భారీ ధరల దెబ్బ.. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు తగ్గుతున్న డిమాండ్!
ఐఫోన్ 18 ప్రో ఉత్పత్తిలో కోత?
తగ్గుతున్న డిమాండ్.. విడిభాగాల తయారీని 15–20 శాతం తగ్గించే యోచనలో యాపిల్!
టెక్ న్యూస్ (ఎన్ టుడే న్యూస్):
ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో వాటి విడిభాగాల ఉత్పత్తిని 15 నుంచి 20 శాతం వరకు తగ్గించాలని యాపిల్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో అమ్మకాలపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ నెల 23న మరింత ఖరీదైన ఫోల్డబుల్ ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త మోడల్‌కు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందనే అంశంపై కంపెనీ దృష్టి సారించినట్లు సమాచారం.
అయితే, విడిభాగాల ఉత్పత్తి తగ్గింపుపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు నిర్ధారణ లేదు. కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్‌లో ఎలాంటి ఆదరణ పొందుతుందో, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో కంపెనీ అమ్మకాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.