BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం
Date of Publish : 24 September 2026, 08:46 pm
Posted by : PAMMI NAVEENKUMAR

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
24 Sep, 2026 - 08:46 PM
3 వీక్షణలు

అమలాపురం, సెప్టెంబర్ 24: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బాషా తెలిపారు.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెలవుకు సంబంధించిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీఈవో సూచించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, తదుపరి విద్యాశాఖ లేదా జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని అనుసరించాలని అధికారులు సూచించారు.