BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 05:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

విధి నిర్వహణలో మానవత్వం.. పసిబిడ్డకు అండగా నిలిచిన మహిళా కానిస్టేబుల్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
03 Nov, 2026 - 05:59 PM
4 వీక్షణలు

విచారణకు వచ్చిన బాధితురాలి ఇబ్బందిని గుర్తించి చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న దీప.. పోలీసు సిబ్బంది, న్యాయవాదుల అభినందనలు

ఎల్బీనగర్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

పోలీసు విధుల్లో బాధ్యతతో పాటు మానవీయతను చాటుకున్నారు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప. విధి నిర్వహణలో భాగంగా ఆమె చూపిన మాతృత్వం, మానవత్వం పలువురి ప్రశంసలు అందుకుంది.

బాధితురాలికి అండగా నిలిచిన దీప

ఎల్‌బీనగర్ స్పెషల్ పోక్సో కోర్టులో విచారణకు చంటి బిడ్డతో హాజరైన ఓ బాధితురాలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని కానిస్టేబుల్ దీప గమనించారు. విచారణ సజావుగా కొనసాగేందుకు ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకుని తల్లిలా ఆలనాపాలనా చూశారు.

మానవీయతకు అభినందనలు

విధి నిర్వహణలో భాగంగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే చిన్నారిని ప్రేమగా చూసుకున్న దీప తీరుపై న్యాయవాదులు, పోలీసు సిబ్బంది అభినందనలు తెలిపారు. పోలీసు వృత్తిలో క్రమశిక్షణతో పాటు మానవత్వం కూడా ఎంత ముఖ్యమో ఆమె తన చర్యతో చాటిచెప్పారు.