BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 01:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యడవల్లి–యర్రావారిగూడెం బీటీ రోడ్డుకు వెంటనే మంజూరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 01:34 PM
28 వీక్షణలు

చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు వినతిపత్రం అందజేసిన టీడీపీ సీనియర్ యువ నాయకుడు నాయుడు మహేష్

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామం నుంచి యర్రావారిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరుతూ యడవల్లి టీడీపీ సీనియర్ యువ నాయకుడు నాయుడు మహేష్ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. యడవల్లి–యర్రావారిగూడెం మధ్య రహదారి అధ్వానంగా మారడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యడవల్లి నుంచి యర్రావారిగూడెం వరకు బీటీ రోడ్డును త్వరితగతిన మంజూరు చేయించి, సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నాయుడు మహేష్ కోరారు. దీనిపై ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయుడు మహేష్ తెలిపారు. కార్యక్రమంలో నాయుడు మహేష్, పలగాని శ్రీనివాసరావు, కాగితాలా చెన్నారావు, ఈడ నాగరాజు, బొల్లికొండ నాగరాజు, ఈడా వీరాస్వామి తదితర టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.