BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనంతపురంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు రూ.6 వేల జరిమానా..

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 09:45 PM
12 వీక్షణలు

బాధితురాలికి రూ.75 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం 

అనంతపురం: మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడి, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించిన నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. బాలికపై జరిగిన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన అనంతపురం పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.75 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని చట్టం వదిలిపెట్టదనే విషయాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. కేసు నేపథ్యం ఇదీ.. అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన నగిరి రమేష్ (39) ఈ కేసులో నిందితుడు. 2021 సెప్టెంబర్ 10న ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక బహిర్భూమికి వెళ్తుండగా నిందితుడు ఆమెను అడ్డగించాడు. నోరు మూసి సమీపంలోని కంపచెట్లలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. అయితే భయపడకుండా బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ధైర్యంగా ఫిర్యాదు.. పోలీసుల దర్యాప్తు ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తన అక్కకు వివరించింది. దీంతో ఇద్దరూ కలిసి యాడికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ రాంభూపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలం, ఇతర ఆధారాలను సేకరించి సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై అనంతపురం పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. 10 మంది సాక్షుల విచారణతో నేరం రుజువు యాడికి పోలీస్‌స్టేషన్ క్రైం నంబర్ 312/2021 కింద ఐపీసీ 506, 376 రెడ్‌విత్ 511, పోక్సో చట్టంలోని సెక్షన్ 7 రెడ్‌విత్ 8 ప్రకారం కేసు నమోదైంది. అనంతపురంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ తరఫున మొత్తం 10 మంది సాక్షులను విచారించగా, నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. దీంతో స్పెషల్ ఎస్సెషన్స్ జడ్జి ఫర్ పోక్సో ట్రయల్ కేసెస్ న్యాయమూర్తి చిన్నబాబు నిందితుడు నగిరి రమేష్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.75 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జి.మురళీకృష్ణ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. నిందితుడికి శిక్ష పడేలా పోలీసుల సమన్వయ కృషి ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసింది. జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీఆర్‌బీ/కోర్టు మానిటరింగ్ వ్యవస్థ సీఐ ఎస్.మురళీకృష్ణ, యాడికి సీఐ ఆర్.శ్రీనివాసులు, కోర్టు లైజన్ అధికారి ఏఎస్ఐ మారన్న విచారణ ప్రక్రియను పర్యవేక్షించారు. సీఎంఎస్ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాసులు, కోర్టు పోలీసు కానిస్టేబుల్ బి.రామమోహన్ సాక్షులను సకాలంలో న్యాయస్థానానికి హాజరుపరిచారు. పోలీసుల సమన్వయం, ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్షుల విచారణతో కేసులో నేరం నిరూపితమై నిందితుడికి శిక్ష పడింది. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఈ తీర్పు మరోసారి హెచ్చరిస్తోంది.