BREAKING
thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే
Date of Publish : 30 September 2026, 07:41 pm
Posted by : NTODAY NEWS

2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
30 Sep, 2026 - 07:41 PM
19 వీక్షణలు

వికలాంగుల జనాభాను తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలి

21 రకాల వైకల్యలను గుర్తించే వరకు ఉద్యమం

NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

NPRD ఆధ్వర్యంలో సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. సెన్సెస్ & టాబ్యూలేషన్ డిప్యుటీ రిజిస్టర్ జనరల్ ఆర్ జ్ఞానశేఖర్ కి వినతిపత్రం అందచేతహైదరాబాద్/ సెప్టెంబర్ 30/ ఎన్ టుడే న్యూస్         

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయం (కేంద్రియ సధన్ కోఠి) ముందు ధర్నా నిర్వహించి,సెన్సెస్ & టాబ్యూలేషన్ డిప్యుటీ రిజిస్టర్ జనరల్ ఆర్ జ్ఞానశేఖర్ గారికి వినతిపత్రం అందచేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వికలాంగుల వివరాలు నమోదు చేయలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ధర్నాను ఉద్దేశించి NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ* 2027 జనాభా లెక్కల సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని,2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను కలిగిన వికలాంగుల వివరాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దేశంలో ఉన్న అన్ని రకాల ప్రజల వివరాలు సమగ్రంగా సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వికలాంగుల వివరాలను సమగ్రంగా ఎందుకు సేకరించడం లేదని అన్నారు.జనాభా లెక్కల సేకరణలో కులాలకు, మతాలకు ఇస్తున్న ప్రాధాన్యత వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.సర్ పేరుతో ప్రజల ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలసేకరణలో వికలాంగుల వాస్తవ సంఖ్యను తగ్గించాలని కుట్రలు చేస్తుందని అన్నారు.

2011 జనాభా లెక్కల సేకరణలో తరువాత జరుగుతున్న 2027 జనాభా లెక్కల సేకరణలో దేశంలో ఉన్న ప్రజల వివరాలు సేకరిస్తున్నారుని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం 21 రకాల వైకల్యలను అధికారికంగా గుర్తించిందని పేర్కొన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం 7 రకాల వైకల్యాల ప్రకారం దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలున్నాయని అన్నారు.

2016 ఆర్ పి డి చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం వికలాంగుల జనాభా 3 రేట్లు పెరగడానికి అవకాశం ఉందన్నారు . కానీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 2027 జనాభా లెక్కల్లో కేవలం 9 రకాలైన అంధులు, వినికిడి వైకల్యం,స్పీచ్, శరీరక వికలాంగులు, మేధో వైకల్యం, మానసిక వికలాంగులు, యాసీడ్ దాడి బాధితులు, ధీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధులు కలిగిన వారు, రక్త సంబంధిత రుగ్మాతలు వంటి వైకాల్యాలు కలిగిన వారీ వివరాలు మాత్రమే నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడన్ని ఖండించారు.ఆటీజం, నిర్థిష్ట అబ్యాసన వైకల్యాలు, మరుగుజ్జుతనం, కుష్ఠువ్యాధి నయమైన వ్యక్తులు, చెవిటి, బ్లైండ్, బహుళ వైకల్యాలు వంటి వారిని ఎందుకు లెక్కించడం లేదన్నారు .అన్ని రకాల రక్త సంబంధిత రుగ్మాతలను ఒకే వర్గంగా లెక్కించాలని ప్రభుత్వం చేసిన నిర్ణయం వికలాంగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వికలాంగుల వివరాలు సేకరించకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హేచ్చరించారు.

NPRD రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 10,48,822 మంది వికలాంగులున్నారని అన్నారు. డిసెబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ఇండియా లెక్కల ప్రకారం 43.02 లక్షల మంది వికలాంగులున్నారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వికలాంగుల వివరాలు నమోదు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వికలాంగుల వివరాలు సమగ్రంగా సేకరించకుంటే విద్యా, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, పునరావాసం, సామాజిక భద్రతతో పాటు వికలాంగులు పొందే అన్ని రకాల సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన వికలాంగుల జనాభా తగ్గడానికి అవకాశం ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో ఉన్న తీవ్ర వైకాల్యం కలిగిన వారీ వివరాలు సేకరించకుంటే వారికి ప్రభుత్వం తరుపున అందే సేవలు పొందలేకపోతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, సహాయ కార్యదర్శులు జెర్కొని రాజు, కె నాగలక్ష్మి,పి బాలిశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికల, భుజంగారెడ్డి, యాదయ్య, రాజు, షాయిన్ బేగం, రమేష్, చంద్రమోహన్, జయలక్ష్మి లతో వివిధ జిల్లాల వికలాంగుల పాల్గొన్నారు.