వర్షాలకు కూలిన మట్టి గోడలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు మండలంలో నిన్నటి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు జి.కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలోని పల్లెర్లమూడి గ్రామంలో ఓ ఇంటి మట్టి గోడలు కూలిపోయాయి. గ్రామానికి చెందిన కంటే అప్పారావు ఇంటి మట్టి గోడలు రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా కూలిపోయాయి. గోడలు కూలిన సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండటంతో కొంత ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాత మట్టి ఇళ్లు, బలహీనంగా ఉన్న గోడలు ఎప్పుడు కూలిపోతాయోనని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బలహీనంగా ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.