BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:34 PM
14 వీక్షణలు

కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసిన మహోన్నత నాయకురాలు ఇందిరాగాంధీ – జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు ఏలూరు: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు కేక్ కట్ చేసి ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కవులూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీకి ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. దేశ ప్రధానిగా ఆమె అమలు చేసిన సంక్షేమ పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి ప్రాణత్యాగం చేసిన నాయకురాలిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారని గుర్తుచేశారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, గౌడు రంగబాబు, బ్లాక్ వన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్క గుప్తా, బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ అధికార ప్రతినిధి బురదకుంట క్రాంతి, ఏలూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బురదగుంట లెవెన్ క్రిస్టియన్, ఏలూరు టౌన్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కొమ్మన సాంబశివరావు, తాళ్లూరి చక్రవర్తి, పులి మార్కండేయులు, శావదండి సుబ్బారావుతో పాటు మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.