BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:14 pm
Posted by : K MAHESH

ఆరుట్లలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:14 PM
17 వీక్షణలు

ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వ పాలన.. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, వెదిరె హన్మంత్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆరుట్ల గ్రామశాఖ అధ్యక్షుడు నూకం బాలరాజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు. ఆమె హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు.

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. పేదలకు సొంత ఇళ్లు కల్పించడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడం, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు చేర్చడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకాలు ఆమె ఆశయాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంచాల మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కావాలి బుగ్గ రాములు ముదిరాజ్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు బైరిక రమాకాంత్ రెడ్డి, మాజీ సర్పంచులు చీమల జంగయ్య యాదవ్, అనంగల్ల యాదయ్య, మంచాల మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సలాం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెదిరె సికిందర్ రెడ్డి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్, అనంగల్ల జగన్నాదం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహగౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, కంబాలపల్లి బుగ్గ రాములు, మార లక్ష్మణ్, కోరే బాబు, ఆరుట్ల గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగల పరమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.