BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:54 pm
Posted by : K MAHESH

బయ్యారంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 06:54 PM
13 వీక్షణలు

ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

బయ్యారం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి కీలక నిర్ణయాలతో పాటు పేదల అభ్యున్నతికి ఆమె ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కంబాల ముసలయ్య, ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా రంజిత్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిని వెంకటేశ్వరరావు, తగిర సత్తిరెడ్డి, వార్డు సభ్యులు శీలం సరోజన, బానోత్ అజయ్, పెద్దినేని శాంత, నందగిరి భద్రయ్య, కొండ్రెడ్డి ప్రమోద్, ఆర్మీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.