BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేవరుప్పులలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:15 PM
11 వీక్షణలు

 దేశ సమగ్రత, ఐక్యత కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం

ఆమె ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలి

జనగామ జిల్లా, దేవరుప్పుల: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేరా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశాయని తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపించిన ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఇందిరా గాంధీ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలబడటమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య సజ్జన్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి మేడ విద్యాసాగర్, మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రి, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు కొంగరి ఉమేష్, ఉప సర్పంచ్ పులి పంపుల భాస్కర్, మండల నాయకులు రెడ్డి రాజుల రమేష్, బోనగిరి యాకయ్య, రామచంద్ర నాయక్, దౌపాటి నరసయ్య, తోటకూరి రమేష్, ఓరికల రతన్, గడ్డం పరంధాములు, సుజాత రెడ్డి, బుర్ర ప్రభాకర్, కడబోయిన సోమయ్య, చింత ఉపేందర్, జిలకర కిషన్, రమేష్, దేవరుప్పుల పట్టణ సామాజిక మాధ్యమాల బాధ్యుడు రెడ్డి రాజుల ఎల్లప్ప తదితర కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.