BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:30 PM
13 వీక్షణలు

దేశాభివృద్ధికి ఇందిరమ్మ చేసిన సంస్కరణలు చిరస్మరణీయం: గద్దల ఆదాం

గంపలగూడెం, నవంబర్ 19: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గద్దల ఆదాం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేక స్థానం ఉందని, ధైర్యసాహసాలకు, నాయకత్వ పటిమకు, మహిళా శక్తికి ఆమె ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, సామాజిక మార్పుల దిశగా ఇందిరా గాంధీ చేపట్టిన పలు కీలక నిర్ణయాలు చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. జమిందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, భూ సంస్కరణలు, అణుశక్తి రంగ అభివృద్ధి వంటి అంశాలు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. మహిళల సాధికారతకు, సమాజంలో మహిళల భాగస్వామ్యం పెంపునకు ఆమె నాయకత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన కృషిని నేటి తరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గద్దల ఆదాం పేర్కొన్నారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా మరోసారి ఇందిరా గాంధీకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. గద్దల ఆదాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గంపలగూడెం మండలం.