BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:12 pm
Posted by : PAGADALA DEVAIAH

రాజపేటలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
19 Nov, 2026 - 07:12 PM
24 వీక్షణలు

విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

రాజపేట, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను రాజపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల చౌరస్తా వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పీఏసీఎస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నమిలి మహేందర్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా నమిలి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో ఆమె సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. భూమిలేని నిరుపేదలకు భూమి పట్టాలు, ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు అందించడంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె కృషి చేశారని తెలిపారు.

విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, బస్టాండ్ల అభివృద్ధికి ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరాగాంధీ ఉచిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాజపేట ఉప సర్పంచ్ నమిలే కేదార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.