BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:04 pm
Posted by : K MAHESH

వలిగొండలో ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:04 PM
15 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు

వలిగొండ, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బత్తిని సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ప్రధానిగా దేశంలో పలు సంస్కరణలు చేపట్టి, అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన, నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. దేశ ప్రజల హృదయాల్లో ఆమె సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు, స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, మండల రైతు సంఘం కన్వీనర్ మామిడి సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాశం సత్తిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ జక్క జంగారెడ్డి, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త కూర వెంకటేశం, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని వరుణ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైసోళ్ల ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యుడు బత్తిని సగేష్, సీనియర్ నాయకులు కాసుల వెంకన్న, గంధమల్ల నరసింహ, మాద శంకర్ గౌడ్, మాజీ డైరెక్టర్ రాచమల్ల తిరుపతయ్య, చిలుకూరి సత్తిరెడ్డి, ఎమ్మె లింగస్వామి, బత్తిని బాల్ శెట్టి, పోలేపాక గోపాల్, ఎమ్మే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.