BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:00 pm
Posted by : K MAHESH

ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం: గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:00 PM
11 వీక్షణలు

నెల్లికుదురు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు

నెల్లికుదురు, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి, పేద ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లికుదురు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య, మండల నాయకులతో కలిసి గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం 20 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేద కుటుంబాల అభ్యున్నతికి ఇందిరాగాంధీ కృషి చేశారని గుర్తుచేశారు. సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా పనిచేసి ‘ఉక్కు మహిళ’గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ‘గరీబీ హటావో’ నినాదంతో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఆమె చూపిన మార్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు గూదే యుగంధర్ గౌడ్, మండల కార్యదర్శులు కుమ్మరికుంట్ల మౌనేందర్, పత్తిపాక తిరుపతాచారి, మండల అధికార ప్రతినిధి వరిపల్లి పూర్ణచందర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్ది రాజేష్, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు బండపల్లి కృష్ణ, యసం యాకయ్య, నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎండీ అప్రోజ్, దర్శనం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.