BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:59 pm
Posted by : K MAHESH

ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం: సర్పంచ్ మాదరి ప్రశాంత్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 06:59 PM
14 వీక్షణలు

శ్రీరామగిరిలో నూతన ఆసరా పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

నెల్లికుదురు, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నారు. గురువారం నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో నూతనంగా మంజూరైన సామాజిక భద్రతా ఆసరా పెన్షన్ల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు సంబంధించిన పెన్షన్ మంజూరు పత్రాలను కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, ఉపసర్పంచ్ రామగిరి సుమన్, గ్రామ పాలకవర్గ సభ్యులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం సర్పంచ్ మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామంలో అర్హులైన వారు ఎవరైనా సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరంగా ఉంటే వారి వివరాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కొత్తగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పెన్షన్లు అందేలా సహకరించిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గొల్లపెల్లి వేణు, బీమలత, పంచాయతీ కార్యదర్శి సీహెచ్ మౌనిక, గ్రామ పెద్దలు గుర్రాల నరేష్, పగిడిపెళ్లి రాములు, గంజి గోవర్ధన్, సోమిరెడ్డి, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.