BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 04:22 pm
Posted by : DAVU RAVINDER REDDY

మూసీ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
25 Sep, 2026 - 04:22 PM
9 వీక్షణలు

గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం.. పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత సూచన

తెలంగాణ, ఎన్ టుడే న్యూస్: ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 640.58 అడుగులకు నీటిమట్టం చేరినట్లు అధికారులు తెలిపారు.

గత 24 గంటల్లో సుమారు 1,150 క్యూసెక్కుల వరద నీరు రిజర్వాయర్‌లోకి చేరినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న గంటల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని నీటిపారుదల శాఖ ఈఈ డి. యాదగిరి తెలిపారు. పరిస్థితులను బట్టి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రిజర్వాయర్ గేట్లను తెరిచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది పరిసరాల్లోకి వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మూసీ నది సమీప ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వరద ప్రవాహం, రిజర్వాయర్ నీటిమట్టంలో మార్పులను ప్రజలు గమనిస్తూ అధికారుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు.