BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 03:03 pm
Posted by : KADARI RAMANA

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
14 Nov, 2026 - 03:03 PM
19 వీక్షణలు

ఈ నెల 25న నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ఆహ్వానం.. మాజీ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్‌కు కూడా ఆహ్వానం

నిర్మల్: ఈ నెల 25న నిర్మల్‌లో నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని యూనియన్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని యూనియన్ నాయకులు వివరించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తున్నప్పటికీ అనేకమంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో పాటు నివాస సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

ఈ నెల 25న జరగనున్న జిల్లా మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

అలాగే, ఈ నెల 20న నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మహాసభలకు హాజరుకావాలని మాజీ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్‌ను యూనియన్ నాయకులు కలిసి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్నగారి భూమయ్య, జాతీయ కార్యవర్గ సభ్యుడు గాండ్ల రాజశేఖర్, జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ డి. యోగి, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మల అశోక్, పూసల పోశెట్టి, వేణుగోపాల్, జిల్లా కార్యదర్శులు జల్దా మనోజ్, హనుమాన్లు, పూజా రెడ్డి, రాజేశ్వర్, డీఎస్ మధు, గంగాధర్, చంద్రశేఖర్, సాయిరాజ్ గౌడ్, శివరామకృష్ణ ప్రసాద్, శ్రీనివాస్, భోజన్న, వెంకటరమణ, కోడె మధు, ప్రశాంత్, ప్రభాకర్ రెడ్డి, లింగేశ్వర్, జహీర్, రమేష్, మల్లేష్, బ్రహ్మం, రాజన్న, ఎం. తీయాలి, ఉమేష్ గుప్తా, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.