BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 05:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసింహారావుపాలెంలో మిరప పంటల పరిశీలన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 05:35 PM
53 వీక్షణలు

వర్షాల అనంతరం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన అధికారి హేమ సూచనలు పంటలు దెబ్బతినకుండా సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టాలి ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామంలో ఉద్యాన అధికారి ఆర్. హేమ మిరప పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో మిరప పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట తిరిగి కోలుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలాల్లో అధికంగా నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే బయటకు పంపించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి, మొక్క మొదళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలని తెలిపారు. మొక్కలు బలహీనపడి తలలు వాలినట్లయితే లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని వారానికి రెండుసార్లు పిచికారీ చేయాలని సూచించారు. వడలిన మొక్కలకు లీటరు నీటికి ఐదు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలని వివరించారు. ఇనుము లోపం కారణంగా మొక్కలు పాలిపోయినట్లు కనిపిస్తే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేది, ఒక నిమ్మకాయ రసం కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. నేల అదునుకు వచ్చిన వెంటనే గొర్రుతో అంతరకృషి చేపట్టాలని సూచించారు. మొక్కలు తిరిగి కోలుకున్న తర్వాత స్థూల పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున, సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున విడివిడిగా వారం రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే వర్షాల అనంతరం బ్యాక్టీరియా ఆకుమచ్చ వంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. రైతులు పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన సమయంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యాన అధికారి హేమ సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.