BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 07:40 pm
Posted by : MENDI SRINIVASARAO

తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ పార్వతీపురం మన్యం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
25 Sep, 2026 - 07:40 PM
16 వీక్షణలు

జియ్యమ్మవలస, సెప్టెంబర్ 25: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని చింతలబెలగాం, దత్తివలస గ్రామాల్లో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలను అరకు పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీ మెంబర్, లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఎల్. రంజిత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నేలమట్టమైన అరటి, మొక్కజొన్న, పామ్ ఆయిల్ తదితర పంటలను ఆయన పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడి, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు తమ పంటలకు జరిగిన నష్టాన్ని రంజిత్ కుమార్‌కు వివరించారు. పంట నష్టంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించి, నష్టాన్ని అంచనా వేయించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

రైతులకు తగిన నష్టపరిహారం అందేలా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్తామని రంజిత్ కుమార్ తెలిపారు. అలాగే సంబంధిత అధికారుల దృష్టికి కూడా పంట నష్టాన్ని తీసుకెళ్లి, నష్టాన్ని అంచనా వేయించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సత్యనారాయణ, నవీన్, వైకుంఠ, సుధా తదితరులు పాల్గొని పంట నష్టాన్ని పరిశీలించారు.