ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు ఆహ్వానం
ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు ఆహ్వానం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఆర్యవైశ్య సంఘం, మహిళా విభాగం, వాసవి సేవాదళ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. చింతలపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కొనకళ్ల రాజ్యలక్ష్మి, చుండ్రు అబ్బయ్య, కొనకళ్ల రాఘవరావుతో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించే సభ్యులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యేను కోరారు.