BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో వైసీపీ బలోపేతంపై జగన్ దృష్టి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 08:07 PM
10 వీక్షణలు

2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత పార్టీని పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేసే దిశగా వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టే అంశంపై గతంలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో వచ్చిన ఫలితాలను పరిశీలించిన అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్ర చేపట్టడం వల్ల ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చని జగన్ భావించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పాదయాత్ర నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ప్రజా సమస్యలపై పోరాటాలను విస్తృతం చేయడంపై జగన్ దృష్టి సారించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు సుమారు ఏడాది ముందు పరిస్థితులను అంచనా వేసి పాదయాత్రపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ పాదయాత్రకు సిద్ధమైతే తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేశ్ కూడా మరోసారి పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే జగన్ పాదయాత్రపై తుది నిర్ణయం, లోకేశ్ పాదయాత్రపై వస్తున్న ప్రచారానికి సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.