BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 08:15 pm
Posted by : కూనురు మధు

జలసిరి పథకంతో భూగర్భ జలాల పెంపు : స్టేట్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ శ్రీధర్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jul, 2026 - 08:15 PM
128 వీక్షణలు

జలసిరి పథకంతో భూగర్భ జలాల పెంపు : స్టేట్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ శ్రీధర్   

జలసిరి పథకంతో భూగర్భ జలాల పెంపొందించొచ్చు అని తెలంగాణ స్టేట్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ శ్రీధర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలసిరి  కార్యక్రమంలో భాగంగా శనివారం పిట్టంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అందే అండాలు అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఎస్బీఎం  కోఆర్డినేటర్ శ్రీధర్ హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విబిజిరాంజీ పథకంలో భాగంగా ప్రతి చిన్నకారు రైతు తమ పొలాల్లో ఫారం పాండ్లు, నీటి కందకాలు, బోర్ వెల్ రీచార్జ్ నిర్మాణాలను ఉచితంగా చేపట్టవచ్చని తెలిపారు. ఈ నిర్మాణాలకు అయ్యే సంపూర్ణ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. వీటి వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, కరువు పరిస్థితుల్లో కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని రైతులకు, సంఘబంధం సభ్యులకు అవగాహన కల్పించారు.

​ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి అని సూచించారు. వర్షపు నీరు, ఇంటి మురుగు నీరు రోడ్లపైకి రాకుండా ఇంకుడు గుంతల ద్వారా ఇంకింపజేయడం వల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ విభాగం ఈసీ వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి గోలి మల్లేష్, వార్డు సభ్యులు జక్కల సీనయ్య, గ్రామ పెద్దలు అందే రాములు, కడారి వెంకటయ్య, అందే భగవంత, ఫీల్డ్ అసిస్టెంట్ బాతరాజు శోభ, వి.బి.కే. సింగిరెడ్డి శోభారాణి, మేడి శైలజ తదితరులు పాల్గొన్నారు.