BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 03:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జులై 14న జమ్మలమడుగుకు మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 03:08 PM
108 వీక్షణలు

కడప జిల్లా, జూలై 8: రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ నెల 14న జమ్మలమడుగుకు రానున్నారు. మైలవరం మండలంలోని చిన్న కొమెర్ల గ్రామ పరిధిలో దాల్మియా సిమెంట్ సెకండ్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

టీడీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 14న జమ్మలమడుగులో బస చేయనున్న మంత్రి లోకేశ్, 15వ తేదీ ఉదయం దాల్మియా సెకండ్ ప్లాంట్ విస్తరణకు భూమిపూజ నిర్వహిస్తారు. ఈ విస్తరణతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

అనంతరం మంత్రి లోకేశ్ మైదుకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.