BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:46 pm
Posted by : PAGADALA DEVAIAH

కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి: సీఐటీయూ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
19 Nov, 2026 - 05:46 PM
25 వీక్షణలు

డిసెంబర్ 1న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఎల్బీనగర్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న కార్మిక పోరాటాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జీహెచ్‌ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కర్మన్‌ఘాట్ చౌరస్తాలో ఎంఎంసీ కార్మికులతో కలిసి చలో పార్లమెంట్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆలేటి ఎల్లయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వడంతో పాటు పెన్షన్లు పెంచాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో లక్షలాది మంది కార్మికులతో సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై గళమెత్తేందుకు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులంతా పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.

స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కార్మికుల వేతనాలు, ఆదాయం, పెన్షన్లలో ఆశించిన పురోగతి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమతో సృష్టించిన సంపద యజమానుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని, పాలకవర్గాలు కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకే పాలకులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థలను వ్యక్తిగత సంస్థలుగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కార్మికులు, ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని విమర్శించారు.