BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

క్లీన్ విజయవాడ లక్ష్యంగా మరో ముందడుగు విజయవాడ కార్పొరేషన్ కు 5 నూతన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
14 May, 2026 - 01:07 PM
92 వీక్షణలు

క్లీన్ విజయవాడే లక్ష్యం గా మరో ముందడుగు -ఎంపీ చిన్ని

విజయవాడ కార్పొరేషన్‌కు 5 నూతన JCBలు

రూ.22 కోట్లతో ఆధునిక JCB వాహనాల ప్రారంభం

అజిత్‌సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో జేసీబీలను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని  ఎమ్మెల్యే బొండా ఉమా

విజయవాడ (సెంట్రల్ )విజయవాడ సెంట్రల్ అజిత్‌సింగ్‌నగర్ VMC డంపింగ్ యార్డ్ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన JCB వాహనాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రారంభించారు విజయవాడ ఎంపీ చిన్ని  నిరంతర ప్రయత్నం వల్లనే కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా వస్తున్నాయని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని  మాట్లాడుతూ “గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోంది” అని, ఫిఫ్తీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఐదు జేసీబీలు రావడం ఆనందంగా ఉందని, 2014కు ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో బాధపడిందని గుర్తుచేస్తూ, ఎమ్మెల్యే బొండా ఉమా నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో చెత్త తొలగింపు, రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు,తెలిపారు 


2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నిధుల నుండి ROBలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని , కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు రోడ్డు విస్తరణ, సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం DPR సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు.


విజయవాడ నగరంలో కాల్వల సుందరీకరణతో పాటు డ్రైనేజ్ నీరు కాల్వల్లో కలవకుండా మినీ STPలు ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని,  దాదాపు 25 మినీ STPల కోసం DPR ప్రక్రియ కొనసాగుతోందని, కాల్వలను పార్కులు మరియు అందమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

వరదలు, డ్రైనేజ్ డీసిల్టింగ్ పనుల్లో జేసీబీలు కీలకంగా ఉపయోగపడతాయని, విజయవాడ అభివృద్ధికి సహకరిస్తున్న 15వ ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి Sk గౌసియా, క్లస్టర్ ఇంచార్జ్ కంచి ధన శేఖర్, బేవర సూర్య, కంచేటి నాగరాజు, పిరియ సోమేశ్వరరావు, దాసరి దుర్గారావు, కూర్మపు దుర్గారావు, మల్లంపాటి రవికుమార్, JCB సంస్థ ప్రతినిధులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...