BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 May 2026, 01:08 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

క్లీన్ విజయవాడే లక్ష్యం.. మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
14 May, 2026 - 01:08 PM
128 వీక్షణలు

విజయవాడ కార్పొరేషన్‌కు రూ.22 కోట్లతో 5 నూతన JCBలు ప్రారంభం

అజిత్‌సింగ్‌నగర్‌లోని VMC డంపింగ్ యార్డ్‌లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన JCB వాహనాలను కేశినేని చిన్ని, బొండా ఉమా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ, ఎంపీ చిన్ని నిరంతర కృషి వల్లే కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా విజయవాడకు వస్తున్నాయని తెలిపారు.

ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, “గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోంది” అని పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఐదు JCBలు రావడం ఆనందంగా ఉందన్నారు.

2014కు ముందు ఈ ప్రాంతం చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో చెత్త తొలగింపు, రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నిధులతో ROBలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు రోడ్డు విస్తరణతో పాటు సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణానికి DPR సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

విజయవాడ నగరంలో కాల్వల సుందరీకరణతో పాటు డ్రైనేజ్ నీరు కాల్వల్లో కలవకుండా మినీ STPలు ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. దాదాపు 25 మినీ STPల కోసం DPR ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కాల్వలను పార్కులు, అందమైన ప్రాంతాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

వరదలు, డ్రైనేజ్ డీసిల్టింగ్ పనుల్లో ఈ JCBలు కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొంటూ, విజయవాడ అభివృద్ధికి సహకరిస్తున్న 15వ ఫైనాన్స్ కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ కార్యదర్శి SK గౌసియా, క్లస్టర్ ఇంచార్జ్ కంచి ధనశేఖర్, బేవర సూర్య, కంచేటి నాగరాజు, పిరియ సోమేశ్వరరావు, దాసరి దుర్గారావు, కూర్మపు దుర్గారావు, మల్లంపాటి రవికుమార్, JCB సంస్థ ప్రతినిధులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.