BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 09:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏఐకేఎం జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కలపాల వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 09:54 PM
5 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామానికి చెందిన కలపాల వెంకటేశ్వరరావు అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎం) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన ఏఐకేఎం 5వ జాతీయ మహాసభల్లో ఆయనను జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు ఏఐకేఎం జాతీయ కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా చిత్తపూరు గ్రామంలో నిర్వహించిన వెంకటేశ్వరరావు అభినందన సభకు హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీలో ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు.

భారత–అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రైతుల ప్రయోజనాలపై ఆందోళనలు ఉన్నాయని హరినాథ్ పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితులు, తుఫాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కరువు పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి అవసరమైన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు స్థాయిలో ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని, కరువు నివారణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని హరినాథ్ డిమాండ్ చేశారు. రైతుల రుణభారం తగ్గించే చర్యలు తీసుకోవడంతో పాటు వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని, నిత్యావసర వస్తువుల విషయంలో అవసరమైన సహాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, జిల్లా కమిటీ సభ్యుడు చాట్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.