BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 28 March 2026, 10:02 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
28 Mar, 2026 - 10:02 AM
153 వీక్షణలు

రామనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

- లోత్నూర గ్రామంలో వైభవంగా వేడుకలు

​గొల్లపల్లి, మార్చి 27:

మండల పరిధిలోని  లోత్తునుర్  గ్రామంలో శ్రీ సీతారాముల  కల్యాణ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య జరిగాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ఆలయాలు రామనామ స్మరణతో మారుమోగాయి.

​వేడుకల విశేషాలు:

​ఉదయం నుండే హనుమాన్ ఆలయం నుండి మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, మరియు భక్తుల నృత్యాల మధ్య స్వామివారిని ఎదుర్కోలుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. వేద పండితులు కట్ట సురేష్ గారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, పునరవసు నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించబడిన స్వామివార్ల కల్యాణాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు.

​ముఖ్య కార్యక్రమాలు:

​కుంకుమ పూజ: మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు.

​అన్నదానం: గజకేసరి ఇండస్ట్రీస్ యజమానులు సురేష్-శివ ప్రసాద్, జయప్రకాష్, శ్రీనివాస్ దంపతులు కల్యాణం జరిపించి, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

​విరాళం: ఆలయ నిర్మాణానికి రూ. 50,116 ల విరాళాన్ని అందజేశారు.

​పాల్గొన్న ప్రముఖులు:

​ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, పుట్టపాక సత్యం, బోనాల రత్నయ్య, ఉప సర్పంచ్ మల్లేష్, కె. సుమన్, బి. లక్ష్మీకాంతం, ఎన్. లక్ష్మీకాంతం, పి. స్వామి గౌడ్, సి.హెచ్. వెంకటేష్, ఎం. తిరుపతి, వడ్లయ్య తిరుపతి, శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ మరియు నాయకులను శాలువాతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.