కనిగిరి నియోజకవర్గం జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఘన సన్మానం
పదవీకాలం పూర్తైన సందర్భంగా అభినందనలు
ఒంగోలు: కనిగిరి నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీల పదవీకాలం పూర్తైన సందర్భంగా ఒంగోలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు.
మడతల కస్తూరి రెడ్డి, గుంటక తిరుపతి రెడ్డి, చప్పిడి సుబ్బయ్య, పెద్దిరెడ్డి లక్ష్మీకాంతం ఓకే రెడ్డి, గంగసాని లక్ష్మీ హుస్సేన్ రెడ్డి, గాయం సావిత్రి, మూడమంచు వెంకటేశ్వర్లు తదితరులను దుశ్శాలువతో సత్కరించి, పూలదండలు వేసి అభినందించారు. అనంతరం షీల్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కనిగిరి నియోజకవర్గం ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదవీకాలంలో స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు అందించిన సేవలను పార్టీ నాయకులు అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.