BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ సన్నిధిలో భక్తిశ్రద్ధలతో చండీహోమం thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు
Test 4
Date of Publish : 09 November 2026, 05:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొచ్చిన్‌లో ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా అభిజిత్ దీప్కే గర్జన.. దేశాన్ని అమ్మేసింది ఎవరు అంటూ మోదీపై విమర్శలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Nov, 2026 - 05:27 AM
25 వీక్షణలు

ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు ప్రజాస్వామ్యాన్ని యువతే కాపాడుకుంటుంది : ప్రకాష్ రాజ్ కొచ్చిన్‌ : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో కొచ్చిన్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 'జంతర్ మంతర్ ఎట్ కొచ్చి' పేరుతో శనివారం రాజేంద్ర మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సిజెపి జాతీయ కన్వీనర్, వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్, జాతీయ నేత అఫ్రీన్ నవాజ్, సిజెపి దక్షిణ భారత ఇన్‌చార్జి విజయ్ రెడ్డి మల్లంగి, ప్రజాస్వామ్య యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతా జెరోమ్ తదితరులు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం ఎగురవేస్తే అరెస్టులా దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు తనను జైలుకు పంపించారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. తన ఇద్దరు సోదరులు సౌరవ్, ఆశుతోష్ కూడా ఇదే కారణంతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన కాలంలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉండేవని, స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను చెప్పదలచుకున్నది ఒక్కటేనని, దేశంలోని ప్రతి ప్రాంతానికి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్తానని, ఎక్కడ అరెస్టు చేసినా మళ్లీ వచ్చి జాతీయ జెండాను ఎగురవేస్తానని ప్రకటించారు. వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శ ప్రభుత్వం క్రమంగా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని దీప్కే విమర్శించారు. ప్రజలు ఏం తినాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయాల్లో జోక్యం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలనే అంశాన్ని కూడా నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు దేశానికి అందించిన ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు దేశవ్యాప్తంగా అక్రమంగా 13 కోట్ల మందికి పైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విదేశీ శక్తులకు సిజెపి లొంగిపోయిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి అంగీకరించిందెవరు, అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో భారత్‌పై 18 శాతం సుంకాలు కొనసాగుతుండగా ప్రతిగా సున్నా సుంకాలకు అంగీకరించిందెవరు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాకు భారత్‌ను అప్పగిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల అధికారుల నియామకాలపై అభ్యంతరం కేరళలో మాజీ ప్రధాన ఎన్నికల అధికారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమితులవడంపై దీప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అధికారిని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమించారని ప్రస్తావించారు. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని యువతే కాపాడుకుంటుంది : ప్రకాష్ రాజ్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని నటుడు ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో యువత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం కాకుండా సామాన్య పౌరుల నాయకత్వంలో ముందుకు సాగాలని సూచించారు. ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ పోరాడుతున్న యువతకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.