BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 22 August 2026, 08:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూతురిని బలవంతంగా తీసుకెళ్లిన తండ్రిపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:25 PM
100 వీక్షణలు

కూతురిని బలవంతంగా తీసుకెళ్లిన తండ్రిపై కేసు నమోదు

తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపల్లె గుంట వీధిలో నాలుగున్నరేళ్ల మైనర్ బాలికను తండ్రి బలవంతంగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న వర్షకు నరసరావుపేటకు చెందిన వెంకటకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహంగా మారింది. వీరికి తన్విశ్రీ అనే నాలుగున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటకృష్ణ తరచూ గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

ప్రస్తుతం బాలిక తల్లి వద్దే ఉంటోంది. 15 రోజుల క్రితం ఉద్యోగ నిమిత్తం హైదరాబాదుకు వెళ్లిన తండ్రి.. శెట్టిపల్లె గుంట వీధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లు తల్లి ఆరోపించింది.

విషయం తెలుసుకున్న తల్లి తండ్రిని ఫోన్ ద్వారా సంప్రదించి తన కుమార్తెను అప్పగించాలని కోరగా స్పందించకపోవడంతో అలిపిరి పోలీసులను ఆశ్రయించింది. తల్లి ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 288/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలిపిరి ఎస్సై రామాంజనేయులు కేసును విచారిస్తున్నారు.