కర్ణాటక తుది ఓటర్ల జాబితా విడుదల.. ఓటర్ల సంఖ్య 4.55 కోట్లకు
జాతీయం
జాతీయం
- ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం సుమారు 99 లక్షల ఓట్లు తగ్గినట్లు నివేదికలు
బెంగళూరు | ఎన్ టుడే న్యూస్:
కర్ణాటకలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనంతరం తుది ఓటర్ల జాబితా విడుదలైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.55 కోట్లకు తగ్గినట్లు సమాచారం. అంటే సుమారు 99 లక్షల ఓట్లు తగ్గగా, మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 18 శాతం తగ్గుదల నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తుది ఓటర్ల జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం:
18–19 ఏళ్ల ఓటర్లు: 6.83 లక్షలు
85 ఏళ్లు పైబడిన ఓటర్లు: 3.92 లక్షలు
దివ్యాంగ ఓటర్లు: 5.65 లక్షలు
ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులకు సంబంధించి తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన ఓటర్లు, సవరణలకు గల కారణాల పూర్తి వివరాలను ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన ఆధారంగా పరిశీలించాల్సి ఉంది.