జైలు సిబ్బందిపై దాడి చేసి ఖైదీల పరారీ
పరారైన వారిలో ఎక్కువ మంది మదురై జిల్లాకు చెందిన నేరస్థులుగా గుర్తింపు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన తేని జిల్లా ఎస్పీ ప్రవీణ్ గౌతమ్
ఖైదీల కోసం పొరుగు జిల్లాల పోలీసులతో ముమ్మర గాలింపు
తమిళనాడు | ఎన్ టుడే న్యూస్:
తమిళనాడులోని తేని జిల్లా ఆండిపట్టి సమీపంలో ఉన్న తెక్కంపట్టి జైలులో ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
పరారైన ఖైదీల్లో ఎక్కువ మంది మదురై జిల్లాకు చెందిన నేరస్థులుగా గుర్తించినట్లు సమాచారం. ఘటన గురించి తెలుసుకున్న తేని జిల్లా ఎస్పీ ప్రవీణ్ గౌతమ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పరారైన ఖైదీల ఆచూకీ కోసం తేని జిల్లాతో పాటు పొరుగు జిల్లాల పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం.
పరారైన ఖైదీల సంఖ్య, వారు తప్పించుకున్న పరిస్థితులు, జైలు సిబ్బందికి జరిగిన గాయాల వివరాలపై అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది.