BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:31 pm
Posted by : KOLA MAHESH

సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 03:31 PM
42 వీక్షణలు

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

  • ఉదయం 9 గంటల నుంచి వైద్య పరీక్షలు

  • గతంలో ఆపరేషన్లు చేయించుకున్నవారికి రివ్యూ పరీక్షలు

  • షుగర్‌, బీపీ కారణంగా ఆపరేషన్ వాయిదా పడినవారికీ అవకాశం

సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి జిల్లా | ఎన్ టుడే న్యూస్‌:

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న బుధవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 27న నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో శస్త్రచికిత్సలకు ఎంపికై ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఈ శిబిరంలో వైద్యులు తిరిగి పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే షుగర్‌, బీపీ కారణంగా గతంలో ఆపరేషన్ చేయించుకోలేకపోయినవారితో పాటు కొత్తగా కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా వైద్య పరీక్షలు అందించనున్నారు.

ఈ శిబిరం బుధవారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు.