BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
మంచి మాట
Date of Publish : 27 October 2026, 04:18 pm
Posted by : SEETHA KIRAN KUMAR

విజయ్ దేవరకొండ, రష్మికపై ఆన్‌లైన్‌ ప్రచారంపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Oct, 2026 - 04:18 PM
22 వీక్షణలు

హైదరాబాద్‌ | ఎన్ టుడే న్యూస్‌:

నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న పోస్టులపై విచారణ జరపాలని కోరుతూ వారి మేనేజర్‌ పి. నిశాంత్‌ కుమార్‌ సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

‘కాఫీ విత్ కరణ్‌’ కార్యక్రమం తర్వాత ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చిన కొన్ని పోస్టులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విడిపోయారని, విడాకులు తీసుకుంటున్నారని పేర్కొంటూ జరుగుతున్న ప్రచారంపై విచారణ జరపాలని కోరినట్లు సమాచారం.

సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్‌ చేసిన స్క్రీన్‌షాట్లు, వీడియోలు, నకిలీ ఖాతాలు, ఆన్‌లైన్‌ వేధింపులకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేయాలని మేనేజర్‌ ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టుల లింకులు, డిజిటల్‌ ఆధారాలను అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు.

సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ప్రచారంలో ఉన్న పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులు, ఖాతాలపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ అధికారులను కోరినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై పోలీసులు తీసుకున్న తదుపరి చర్యలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.