BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:52 pm
Posted by : KOLA MAHESH

జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 03:52 PM
36 వీక్షణలు
  • గుజరాత్‌లో అక్టోబర్ 31న జరిగే వేడుకల్లో పాల్గొనే అవకాశం
  • సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా వేడుకలు

సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్‌:

గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా జిల్లాలో అక్టోబర్ 31న నిర్వహించనున్న రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకల్లో పాల్గొనేందుకు సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి–లింగస్వామి దంపతులు ఎంపికయ్యారు.

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఐదు గ్రామాలకు ఈ జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించగా, వాటిలో సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చోటు దక్కింది. గ్రామ సర్పంచ్ దంపతుల ఎంపికపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశ తొలి ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గుజరాత్‌లో జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు సమాచారం.

జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం గ్రామానికి గర్వకారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.