BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:48 pm
Posted by : P GAJENDRA BABU

వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency
27 Oct, 2026 - 03:48 PM
21 వీక్షణలు
  • పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపు లభించిందని జనసేన శ్రేణుల హర్షం

  • కూటమి నాయకులు, కార్యకర్తల సహకారంతో విజయం సాధిస్తానన్న తడ శ్రీనివాసులు

వరదయ్యపాలెం | ఎన్ టుడే న్యూస్‌:

వరదయ్యపాలెం జెడ్పీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా తడ శ్రీనివాసులు పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయనకు బీ ఫాం అందజేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చేసిన సేవలకు గుర్తింపు లభించిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఉన్న తడ శ్రీనివాసులు పార్టీ బలోపేతానికి కృషి చేశారని, పార్టీ పిలుపు మేరకు పలు కార్యక్రమాలు, ఉద్యమాల్లో పాల్గొన్నారని ఆయన అనుచరులు తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కేసులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

వరదయ్యపాలెం జెడ్పీటీసీ అభ్యర్థిత్వంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడిందని జనసేన శ్రేణులు పేర్కొన్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఆశీస్సులతో అధిష్టానం తడ శ్రీనివాసులును అభ్యర్థిగా ఖరారు చేసి బీ ఫాం అందించిందని ఆయన మద్దతుదారులు తెలిపారు. ఈ నిర్ణయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జెడ్పీటీసీ అభ్యర్థిగా తనను గెలిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని తడ శ్రీనివాసులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మండల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.