BREAKING
thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంచి మాట
Date of Publish : 27 October 2026, 04:21 pm
Posted by : DAVU RAVINDER REDDY

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal
27 Oct, 2026 - 04:21 PM
18 వీక్షణలు

ఘట్‌కేసర్‌ | ఎన్‌ టుడే న్యూస్‌:

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న కాలుష్య సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటం ఆపేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. మంగళవారం జవహర్‌నగర్‌ జన సంకల్ప యాత్రలో భాగంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ పెద్ద చెరువును ఆయన సందర్శించారు. చెరువు కాలుష్యం కారణంగా మత్స్య సంపద దెబ్బతిందని, తమ జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు, స్థానిక ప్రజలు ఆయనకు తమ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువు ఈ ప్రాంతంలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటని, గతంలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు, మత్స్యకారులకు జీవనాధారంగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం చెరువు నీటి పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ నుంచి వెలువడే విషపూరిత లీచేట్‌ నీటిని సరైన శుద్ధి చేయకుండా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో చెరువులో చేపలు చనిపోతున్నాయని ఆయన అన్నారు. కలుషిత నీరు తాగి పశువులు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నీరు భూగర్భ జలాల్లోకి చేరడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కాలుష్యం కారణంగా స్థానికులు కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌, శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. గాలి, నీటి కాలుష్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా కాలుష్యం వల్ల తమ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని స్థానికులు ఎంపీకి విన్నవించారు. సంపాదించిన డబ్బంతా వైద్యం, మందులకే ఖర్చవుతోందని, గతంలో సంతోషంగా జీవించిన తమ కుటుంబాలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్‌ యార్డ్‌ సమస్యపై గతంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, సుప్రీంకోర్టులో కేసులు నమోదయ్యాయని ఈటల రాజేందర్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సమస్యకు పరిష్కారం లభించలేదని విమర్శించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెత్తను సమర్థంగా ప్రాసెస్‌ చేయవచ్చని, దాని నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులను తయారు చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త నిర్వహణ చేపట్టాలని సూచించారు.

మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రజలకు ఉపశమనం లభిస్తుందని భావిస్తే, మరోవైపు జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ కాలుష్యం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మూసీ కాలుష్యం, జవహర్‌నగర్‌ నుంచి వెలువడుతున్న వ్యర్థాల సమస్యలపై ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎదులాబాద్‌ నుంచి ప్రారంభమైన జన సంకల్ప యాత్రలో భాగంగా నాలుగు రోజుల పాటు సుమారు 60 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, చివరగా జవహర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌ పరిసరాల్లో జనావాసాలకు దూరంగా, శాస్త్రీయ ప్రమాణాలతో ఆధునిక కాలుష్యరహిత డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలని ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే లక్షలాది మంది ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

మత్స్యకారులు, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌ సభ్యుడిగా బాధితుల తరఫున పోరాడతానని స్పష్టం చేశారు.

చెరువు వద్దకు చేరుకున్న ఈటల రాజేందర్‌ పసుపు, కుంకుమ సమర్పించి పూజలు నిర్వహించిన అనంతరం మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.