రాజేంద్రనగర్ పరిధిలో భారీ శబ్దాలు.. భూమి కంపించిందంటున్న స్థానికులు
తెలంగాణ
/
హైదరాబాద్
పేలుడు సంభవించిందనే అనుమానాలు.. ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్:
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎర్రబోడ, ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో ఈ శబ్దాలు వినిపించినట్లు సమాచారం.
భారీ శబ్దాల అనంతరం భూమి కొన్ని సెకన్ల పాటు కంపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఏదైనా పేలుడు సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, శబ్దాలకు గల కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.