BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
మంచి మాట
Date of Publish : 27 October 2026, 05:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమి అభ్యర్థి గెలుపునకు పూర్తి సహకారం మంత్రి కొలుసు పార్థసారథి హామీతో నామినేషన్ ఉపసంహరించుకున్న బుర్రి శ్రీకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 05:59 PM
5 వీక్షణలు

ఏలూరు జిల్లా:- నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి: చాట్రాయి మండలం చనుబండ ఎంపీటీసీ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన తాను, పార్టీ జిల్లా నాయకత్వం నిర్ణయం మేరకు ఈరోజు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, చనుబండ ఎంపీటీసీ అభ్యర్థి బుర్రి శ్రీకర్ తెలియజేశారు. గౌరవ మంత్రి కొలుసు పార్థసారథి చాట్రాయి మండలంలో బీజేపీకి కోఆప్షన్ ఎంపీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ తనతో మాట్లాడి కూటమి అభ్యర్థుల గెలుపునకు బీజేపీ కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలని కోరుతూ సమన్వయం చేసినట్లు బుర్రి శ్రీకర్ తెలియజేశారు. ఈ క్రమంలో చాట్రాయి మండల ఎన్నికల అధికారుల సమక్షంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీ, బీజేపీ జిల్లా నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నామినేషన్ ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలిపారు. ఈరోజు నుంచి కూటమి ఎంపీటీసీ అభ్యర్థికి పూర్తిస్థాయిలో మద్దతు అందించడంతో పాటు ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని బుర్రి శ్రీకర్ తెలియజేశారు.